Tadipatri: పక్కపక్కనే ఉన్న అన్నదమ్ముల ఇళ్లల్లో దొంగతనం… రంగంలోకి దిగిన పోలీసుల మైండ్ బ్లాంక్..

|

Jul 25, 2021 | 8:20 PM

పెళ్లై ఇద్దరు బిడ్డలున్న వివాహిత మరొకరి మోజులో పడింది. అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇకపై ప్రియుడితో ఉండాలని డిసైడయ్యింది....

Tadipatri: పక్కపక్కనే ఉన్న అన్నదమ్ముల ఇళ్లల్లో దొంగతనం... రంగంలోకి దిగిన పోలీసుల మైండ్ బ్లాంక్..
Women Escape
Follow us on

పెళ్లై ఇద్దరు బిడ్డలున్న వివాహిత మరొకరి మోజులో పడింది. అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇకపై ప్రియుడితో ఉండాలని డిసైడయ్యింది. డబ్బుతో ఎస్కేప్ అయ్యేందుకు పక్కా ప్లాన్ గీసింది. తన ఇంట్లో అయితే సరిపోదనుకుందేమో, ఏమో పక్కనే ఉంటున్న బావ ఇంటికి కూడా కన్నం వేసింది. ఇంట్లో బంగారం, వెండి చోరీ జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో తనకేమీ తెలియనట్టు ఆస్కార్ రేంజ్‌లో నటించింది. వన్ ఫైన్ డే… ప్రియుడితో కలిసి జంపయ్యింది. దీంతో అసలు వ్యవహారం తేలిపోయింది.  ఈ  ఘటన తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో జరిగింది.  మే 22న పక్కపక్కనే ఉన్న ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లలో చోరీలు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు బంగారం, వెండి చోరీ చేశారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. అదే సమయంలో ఉన్నట్టుంది ఆ ఇంట్లో తమ్ముడి భార్య అదృశ్యం అవ్వడంతో ఖాకీలకు కాస్త తేడా కొట్టింది. ఇంట్లో దొంగతనం జరగడం.. కొద్దిరోజులకే కూతురితో సహా భార్య మాయం కావడంతో వారికి అనుమానాలు కలిగాయి. ఆ దిశగా విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయాలు తెలిశాయి. కట్టుకున్న భార్యే సొంతింటికి కన్నమేసినట్లు తేల్చారు. ఆమె ప్రియుడితో పారిపోయినట్లు గ్రహించిన పోలీసులు వారి కోసం గాలించారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఉంటున్నట్టు గుర్తించి తాడిపత్రి పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. చూశారుగా వివాహేతర సంబంధం ఎలా కొంప ముచ్చిందో. తస్మాత్ జాగ్రత్త.

Also Read:  Viral Video: చిరుతను మింగేందుకు ఎగబడి వచ్చిన కొండ చిలువ.. చివరికి షాకింగ్ సీన్

Viral News: భారీ మొసలిని చుట్టేసి అమాంతం మింగేసిన కొండ చిలువ… వామ్మో..!