Teacher Indecency: కామంతో ఊగిపోయిన టీచర్.. స్కూల్‌లోనే చితకబాదిన పేరెంట్స్

విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరే కామంతో రెచ్చిపోయాడు. అసభ్య ప్రవర్తనతో వృత్తికే మచ్చతెచ్చాడు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు

Teacher Indecency: కామంతో ఊగిపోయిన టీచర్.. స్కూల్‌లోనే చితకబాదిన పేరెంట్స్

Updated on: Sep 07, 2021 | 5:06 PM

Guntur Teacher Indecency: విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరే కామంతో రెచ్చిపోయాడు. అసభ్య ప్రవర్తనతో వృత్తికే మచ్చతెచ్చాడు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు జడ్పీ పాఠశాలలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుడు రవికుమార్‌ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాఠశాలలో విద్యార్థిని చేయి పట్టుకోవడమే కాదు.. తానే తప్పూ చేయలేదంటూ బుకాయించడంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. సదరు టీచర్‌ రవికుమార్‌ను చితకబాదారు. అడ్డువచ్చిన ఉపాధ్యాయులపై కూడా దాడి చేశారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఈ ఉదంతంపై స్కూల్‌లోనే విచారణ చేస్తున్నారు పోలీసులు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.

Read also: Kamma Corp Chairman: ‘చంద్రబాబు కొందరు చెంచాలతో సీఎం జగన్‌ని తిట్టిస్తున్నాడు’: కమ్మ కార్పొరేషన్ చైర్మన్