Mancherial road accident : మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బీభత్సం సృష్టించింది. ఎదురెదురుగా బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన బైకులు అర్జునగుట్ట వంతెన వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైకులు ఢీకొన్న వేగానికి అంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ ప్రాంతమంతా క్షతగాత్రులను భయానకంగా మారింది.
అయితే, రోడ్డుపై పడిపోయి తీవ్రగాయపడ్డ వారిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చెన్నూరు ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలసీులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి… ముంబైలో మరోసారి విజృంభిస్తున్న మహమ్మరి.. అప్రమత్తమైన బీఎంసీ అధికారులు.. కంటెన్మెంట్ జోన్లుగా పలు భవనాలు