Viral Video: గుడిలో దొంగలు.. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు.. దేవుడి సొమ్మును ఎలా దొంగలించారో చూడండి..

Temple Theft: గుంటూరులో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లాంటి పట్టణాలకే పరిమితమైన చెడ్డీ గ్యాంగ్‌ తొలిసారి గుంటూరులో కనిపించి భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే...

Viral Video: గుడిలో దొంగలు.. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు.. దేవుడి సొమ్మును ఎలా దొంగలించారో చూడండి..
Viral Video Theft

Updated on: Dec 08, 2021 | 10:54 AM

Temple Theft: గుంటూరులో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లాంటి పట్టణాలకే పరిమితమైన చెడ్డీ గ్యాంగ్‌ తొలిసారి గుంటూరులో కనిపించి భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. అపార్ట్‌మెంట్‌లోకి దూరి ఒంటిపై నూనె పూసుకొని దోపీడికి దిగిన సంఘటనలు నగరంలో సంచలనం సృష్టించాయి. దీంతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వెస్ట్‌ డిఎస్పీ సుప్రజ హెచ్చరించారు. అయితే చడ్డీ గ్యాంగ్‌ హల్చల్‌ ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు మరో దొంగతనం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

తాజాగా సోమవారం రాత్రి గోరంట్ల మొయిన్ రోడ్డులోని రామాలయంలో దొంగలు పడ్డారు. దేవాలయం లోపలికి ప్రవేశించిన దొంగలు కట్టర్‌తో మూడు హుండీలను పగలగొట్టారు. హుండీలోని కానుకలు, సొమ్మును తీసుకొని ఉడాయించారు. మొయిన్ రోడ్డుపై ఉన్న దేవాలయంలో చోరికి పాల్పడి దొంగలు పోలీసులకు సవాల్ విసిరారు. దొంగతనానికి సంబంధించి దృశ్యాలు గుడిలో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరా విజువల్స్‌ను పరిశీలించారు. ముగ్గురు దొంగలు హుండీలను పగలగొట్టారని నల్లపాడు సీఐ ప్రేమయ్య చెప్పారు. సీసీటీవీ కెమెరా విజువల్స్ ఆధారంగా త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు. వరుస దొంగతనాలతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Also Read: Corona Virus: నో డౌట్.. మూడో ముప్పు కన్ఫర్మ్ !! లైవ్ వీడియో

Carrot Benefits: వింటర్‌లో క్యారెట్ తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

AP Job Recruitment 2021: ఏపీ డీఎంఈ విభాగంలో ఉద్యోగాలు.. భారీగా వేతనం.. దరఖాస్తుకు గడువు ఇంకా ఒకరోజు మాత్రమే..!