Girl Rape – UP panchayat: ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పంచాయతీ పెద్దలు.. బాలిక శీలానికి వెలకట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పంచాయతీ పెద్దలు 50 వేల పరిహారంతోపాటు.. ఐదు చెప్పు దెబ్బల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. గ్రామ పెద్దలు న్యాయం చేయకపోవడంతో.. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మహారాజ్ గంజ్ జిల్లాలోని కోఠిభర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ నెల 23న గ్రామానికి చెందిన యువకుడు తమ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. బాధితురాలి కుటుంబం పంచాయితీ పెద్దకు ఫిర్యాదు చేసింది.
23 సాయంత్రం పొలంలో కూరగాయలు కోస్తుండగా.. నిందితుడు 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం నిందితుడు బాలికను అక్కడ వదిలేసి పారిపోయాడు. తరువాత ఇంటికి చేరిన బాలిక ఈ సంఘటన గురించి కుటుంబసభ్యులకు వివరించింది. ప్రాణభయం ఉండటంతో.. భయపడిన బాధితురాలు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. న్యాయం కోసం గ్రామ పంచాయితీ పెద్దను సంప్రదించింది. కానీ పంచాయితీ పెద్దలు మాత్రం.. నిందితుడికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.50 వేలు జరిమానా విధిస్తూ విచిత్రమైన తీర్పునిచ్చింది.
ఈ తీర్పుతో మనస్థాపానికి గురైన ఆ కుటుంబం 25న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి తమకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ఘటనపై పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతోపాటు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసు అధికారి ధన్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. “కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పరీక్షల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read: