రాజస్థాన్‌లోని జలూర్ జిల్లాలో దారుణం.. బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మృతి.. 17 మందికి గాయాలు..

రాజస్థాన్ రాష్ట్రంలోని జలూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు బస్సుకు తాకడంతో మంటలు చెలరేగి ఆరుగురు

  • uppula Raju
  • Publish Date - 7:42 am, Sun, 17 January 21
రాజస్థాన్‌లోని జలూర్ జిల్లాలో దారుణం.. బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మృతి.. 17 మందికి గాయాలు..

రాజస్థాన్ రాష్ట్రంలోని జలూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు బస్సుకు తాకడంతో మంటలు చెలరేగి ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జలూర్ జిల్లా అదనపు కలెక్టర్ చాగన్ లాల్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం..

జలూర్ జిల్లా మహేశ్‌పూర్‌లో కొంతమంది ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ అక్కడికక్కడే మరణించగా, ఆరుగురు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన 17 మందిని దగ్గరలో ఉన్న జోధ్‌పూర్  ఆస్పత్రికి తరలించామని తెలిపారు. స్థానికంగా జరిగిన ఈ ఘటన అందరిని కలవరపాటుకు గురిచేసింది. పండగ పూట ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్పత్రి ప్రాంగణంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.