Rowdy Sheeter Murdere: విశాఖలో రౌడీ షీటర్‌ దారుణ హత్య.. కత్తులు, ఇనుపరాడ్లతో దాడి.. వివరాలు ఇలా ఉన్నాయి..

|

Feb 24, 2021 | 4:56 AM

Rowdy Sheeter Murdere: విశాఖ జిల్లా మద్దిలపాలెం సమీపంలోని నక్కవానిపాలెం వద్ద దారుణ హత్య జరిగింది. ఓ రౌడీ షీటర్‌ను

Rowdy Sheeter Murdere: విశాఖలో రౌడీ షీటర్‌ దారుణ హత్య.. కత్తులు, ఇనుపరాడ్లతో దాడి.. వివరాలు ఇలా ఉన్నాయి..
Follow us on

Rowdy Sheeter Murdere: విశాఖ జిల్లా మద్దిలపాలెం సమీపంలోని నక్కవానిపాలెం వద్ద దారుణ హత్య జరిగింది. ఓ రౌడీ షీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా పొడిచి చంపారు. స్థానికంగా ఈ ఘటన భయబ్రాంతులకు గురి చేస్తోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రౌడీ షీటర్‌ వెంకట్‌రెడ్డి అలియాస్‌ బండ రెడ్డి కేఆర్ఎం కాలనీలోని తన నివాసానికి సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పై కూర్చొని ఉన్నాడు. ఈ సమయంలో ద్విచక్రవాహనంలో ఇద్దరు వ్యక్తులు, కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి బండరెడ్డిపై ఇనుపరాడ్డులతో ఒక్కసారిగా దాడికి దిగారు. తలపై బలంగా గాయం కావడంతో బండరెడ్డి కిందపడ్డారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రరక్తస్రావం అయి బండరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.

గతంలో నేర చరిత్ర ఉన్న బండరెడ్డి డబ్బులు తీసుకొని నేరాలు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. గతంలో రెండు హత్య కేసుల్లో బండరెడ్డి పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తనతో పాటే తిరిగిన వ్యక్తులు ఆధిపత్యం కోసం ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో బండరెడ్డితో పాటు సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులతో తనకు విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించినట్లు సమాచారం.

Central Electoral Commission: బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలపై కసరత్తు..