రేప్ బాధితురాలికి నిప్పంటించిన మృగాడు

రేప్ బాధితురాలికి నిప్పంటించిన మృగాడు

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగిందో దారుణం. తనపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై గత మార్చిలో కేసు పెట్టిన బాధితురాలి మీద వారు పగ పెంచుకున్నారు. ఆ కేసుకు సంబంధించి బుధవారం తన గ్రామం నుంచి కోర్టుకు వెళ్తున్న 23 ఏళ్ళ ఈమెపై ముగ్గురు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమెకు 60 శాతం నుంచి 70 శాతం కాలిన గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు వెంటనే మొదట దగ్గరలోని ఆసుపత్రికి… . అనంతరం మెరుగైన […]

Anil kumar poka

|

Dec 05, 2019 | 12:54 PM

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగిందో దారుణం. తనపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై గత మార్చిలో కేసు పెట్టిన బాధితురాలి మీద వారు పగ పెంచుకున్నారు. ఆ కేసుకు సంబంధించి బుధవారం తన గ్రామం నుంచి కోర్టుకు వెళ్తున్న 23 ఏళ్ళ ఈమెపై ముగ్గురు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమెకు 60 శాతం నుంచి 70 శాతం కాలిన గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు వెంటనే మొదట దగ్గరలోని ఆసుపత్రికి… . అనంతరం మెరుగైన వైద్యం కోసం లక్నో లోని ఆసుపత్రికి తరలించారు. తనపై ఈ దారుణానికి పాల్పడిన ఆ ముగ్గురి పేర్లను బాధితురాలు వెల్లడించిందని, వారిని అరెస్టు చేశామని, వారికి సహకరించిన మరో ఇద్దరికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. గత మార్చి నెలలో ఈ రేపిస్టులు ఈమెపై అమానుషానికి పాల్పడి.. దాన్ని వీడియోగా చిత్రీకరించారట..

దేశంలో మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నా.. ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినప్పటికీ, పోలీసుల ఉదాసీనత, చట్టాల్లోని లొసుగుల కారణంగా మృగాళ్లు సులభంగా బయటపడిపోతున్నారు. కొంతకాలం శిక్ష అనుభవించి.. బెయిలుపై నేరగాళ్లు, కీచకులు విడుదలవుతున్నారు. దిశ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల సభ్యులూ ఈ ఘాతుకాన్ని ఖండిస్తూ ప్రసంగాలు చేశారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఈ దారుణం మాటలకు అందనిదని, అంతా కలిసి చట్టాలను మరింత పదును పెట్టేందుకు కృషి చేద్దామని అన్నారు. అయితే ప్రధాని, మోదీ నుంచి గానీ, హోం మంత్రి అమిత్ షా నుంచి గానీ స్పందన లేదు.. పౌరసత్వ సవరణ బిల్లుపై ఉన్నంత శ్రద్ధ ఈ విధమైన ఘోరాల కట్టడిలో చూపితే బాగుండేదన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu