దారుణ ఘటన.. అయిదో తరగతి బాలికపై.. బస్సులోనే ఓ కామాంధుడు..

| Edited By:

Nov 18, 2019 | 6:53 AM

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. బస్సులోనే ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. అభం శుభం తెలియని ఓ అమాయక బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అయిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై.. వరుసకు మామ అయ్యే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిన సదరు బాలిక.. స్లీపర్ బస్సులో తన తల్లి, బంధువులతో కలిసి తిరుగుప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ బాధిత బాలిక విషయాన్ని […]

దారుణ ఘటన.. అయిదో తరగతి బాలికపై.. బస్సులోనే ఓ కామాంధుడు..
Follow us on

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. బస్సులోనే ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. అభం శుభం తెలియని ఓ అమాయక బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అయిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై.. వరుసకు మామ అయ్యే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిన సదరు బాలిక.. స్లీపర్ బస్సులో తన తల్లి, బంధువులతో కలిసి తిరుగుప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ బాధిత బాలిక విషయాన్ని తన తల్లికి తెలిపింది. దీంతో ఆమె పోలీసులను సంప్రదించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, వైద్య పరీక్షల నిమిత్తం సదరు బాలికను ఆస్పత్రికి తరలించారు.