Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గంలో విషాదం.. వేర్వేరు కారణాలతో ముగ్గురు మృతి

Puttaparthi: ఎండ్ల పందాల్లో పాల్గొని ఒకరు, అప్పుల బాధ తాళలేక మరొకరు, విద్యుత్‌ షాక్‌తో ఇంకొకరు, ఇలా ముగ్గురు వ్యక్తులు మృతిచెందడంతో మూడు కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి..

Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గంలో విషాదం.. వేర్వేరు కారణాలతో ముగ్గురు మృతి

Updated on: Apr 04, 2022 | 12:25 AM

Puttaparthi: ఎండ్ల పందాల్లో పాల్గొని ఒకరు, అప్పుల బాధ తాళలేక మరొకరు, విద్యుత్‌ షాక్‌తో ఇంకొకరు.. ఇలా ముగ్గురు వ్యక్తులు మృతిచెందడంతో మూడు కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం (Puttaparthi Constituency)లోని మూడు కుటుంబాల్లో విషాదం జరిగింది. కొత్త చెరువులో ఇటీవల ఎడ్లబండ్ల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కుల్లాయప్ప అనే వ్యక్తిపైకి దూసుకెళ్లింది ఓ ఎడ్లబండి. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ కుల్లాయప్ప మృతిచెందాడు.

ఇక కొత్తచెరువు మండలం మామిళ్లకుంట క్రాస్‌కు చెందిన అనిల్‌ చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. కరోనా కారణంగా వ్యాపారం లేక, అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ తాళలేక, కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు అనిల్‌. అటు అమడగూరు మండలం పూలకుంటపల్లికి చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగి, చంద్రచారి విద్యుత్‌ షాక్‌తో చనిపోయారు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చంద్రాచారి మృతిచెందాడని ఆరోపిస్తున్నారు ఆయన బంధువులు. ఒకేరోజు ఇలా ముగ్గురు చనిపోవడంతో నియోజకవర్గంలో విషాదం నెలకొంది. ఈ మూడు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు వారి బంధువులు.

ఇవి కూడా చదవండి:

Train Accident: నాసిక్‌లో తప్పిన పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. కొనసాగుతున్న సహాయకచర్యలు

Hyderabad: డ్రగ్స్‌ కేసులో నా కొడుకుకు సంబంధం లేదు.. వేధించవద్దు: ఉప్పల శారద