మాస్క్ ధరించని 467 మందిపై కేసులు

|

Jul 09, 2020 | 2:38 PM

కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మాస్క్‌ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు.

మాస్క్ ధరించని 467 మందిపై కేసులు
Follow us on

కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మాస్క్‌ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు. అత్యవసర పనులపై బయటకు వచ్చిన సమయంలో భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, వైద్యాధికారులు సైతం సూచిస్తున్నారు. అయినా కొందరు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాస్క్ ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో తనిఖీలు విస్తృతం చేశారు. ఈ మేరకు 467 మందిపై ఈ పిటీ కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. ప్రభుత్వ ఉత్తర్వులు పాటించని వారిని గుర్తించి ఫైన్ వేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాస్కులు ధరించని వారి వివరాలను ట్యాబ్‌ల్లో నమోదు చేసి ఆన్‌లైన్‌ ద్వారా జరిమానా విధిస్తున్నామని వరంగల్ డీసీపీ తెలిపారు. కేసులు నమోదైన వ్యక్తులు కోర్టుకు వెళ్లి జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న పోలీసులకు సహకరించాలని సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జ్‌ డీసీపీ తిరుపతి కోరారు.