తాగి వేధిస్తున్న కొడుకును హతమార్చిన తల్లి

మద్యం మత్తులో ప్రతి రోజు వేధిస్తున్న కన్న కొడుకును కడతేర్చింది ఓ తల్లి. కృష్ణా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడులోని బొమ్ములూరు గ్రామానికి చెందిన కొల్లి బాబి(29)ని అతని తల్లి బండరాయితో మోది హత్య చేసింది.

తాగి వేధిస్తున్న కొడుకును హతమార్చిన తల్లి

Updated on: Jul 17, 2020 | 10:42 PM

మద్యం మత్తులో ప్రతి రోజు వేధిస్తున్న కన్న కొడుకును కడతేర్చింది ఓ తల్లి. కృష్ణా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడులోని బొమ్ములూరు గ్రామానికి చెందిన కొల్లి బాబి(29) మద్యానికి బానిసై పనిపాట లేకుండా తిరుగుతున్నాడు. తల్లి సంపాదనపై ఆధారపడి కాలం వెల్లదీస్తున్నాడు. ప్రతి రోజు మద్యం సేవించేందుకు డబ్బు కోసం తల్లిని వేధించడం మొదలుపట్టాడు. రోజురోజుకు కొడుకు వేధింపులు ఎక్కువ అవడంతో భరించలేకపోయింది. ఇదే క్రమంలో ఇటీవల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొడుకు చేష్టలకు విసుగు చెందిన తల్లి నిద్రమత్తులో ఉన్న బాబిని రాయితో మోది హతమార్చింది. అనంతరం నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us