దారుణం.. మైనర్‌ బాలికపై 400 మంది అత్యాచారం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ..!

|

Nov 14, 2021 | 6:41 PM

దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొందరు మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మైనర్‌ బాలికలు, మహిళలు, వృద్ధులపై పెరుగుతున్న నేరాలను చూస్తే సమాజం దలదించుకులా ఉంది...

దారుణం.. మైనర్‌ బాలికపై 400 మంది అత్యాచారం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ..!
Follow us on

దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొందరు మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మైనర్‌ బాలికలు, మహిళలు, వృద్ధులపై పెరుగుతున్న నేరాలను చూస్తే సమాజం దలదించుకులా ఉంది. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. బీడ్‌ జిల్లాలో ఓ మైనర్‌ బాలికపై 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఉద్యోగం పేరుతో ప్రతివాడు పరిచయం చేసుకుని ఆమెను మోసగిస్తూ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు. కొందరు లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారంకు పాల్పడినట్లు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇవన్నీ బాలిక ఆరోపిస్తుండగా, వరుస అత్యాచారాల కారణంగా గర్భం దాల్చి దిక్కుతోచని స్థితిలో ఉంది. చివరకు శిశు సంక్షేమ శాఖ ను ఆశ్రయించింది ఆ బాలిక. అక్కడి అధికారుల సాయంతో బాలికతో అత్యాచార కేసు నమోదైంది. అయితే ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళితే పోలీసులు కూడా అత్యాచారం చేసినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై బీడ్‌ జిల్లా ఎస్పీ ఆర్‌. రాజా మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని అంబేజోగా తాలుకాలో ఓ గ్రామానికి చెందిన బాధితురాలుది నిరుపేద కుటుంబం. ఆ బాలిక తల్లిదండ్రులు రోజు కూలి పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. బాలిక పెద్దగా చదువుకోకపోయింది. రెండు సంవత్సరాల కిందట తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. కూతురుని పోషించలేక తండ్రి బాలియకు చిన్న వయసులోనే బాల్య వివాహం జరిపించాడు. చిన్నవయస్సులో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆమెకు మామ నుంచి వేధింపులు మొదలయ్యాయి. అంతేకాకుండా భర్త సైతం తండ్రినే సమర్ధించేవాడు. సంవత్సరన్న పాటు అత్తింట్లో కష్టాలు వెళ్లదీసిన ఆ బాలిక.. చివరకు తండ్రి వద్దకు చేరుకుంది. ఖాళీగా ఉండటంతో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కోసం ఆరు నెలల కిందట అంబేజోగై పట్టణానికి చేరుకుంది. అక్కడ ఓ కోచింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు బాలికకు పరిచయం అయ్యారు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత ఆ ఇద్దరూ స్నేహితులు కొందరూ ఇదే సాకుతో ఆ బాలిక అత్యాచారం చేశారు. ఇలా గడిచిన ఆరు నెలల కాలంలో దాదాపు 400 మంది అత్యాచారం చేశారని బాలిక పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే బాలిక చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 9 మందిని నిందితులుగా చేర్చినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇందులో కొందరు పోలీసులను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. గర్భంతో ఉన్న బాలిక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు అబార్షన్‌ చేయించేందుకు శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బాలికకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Cyber Crime: పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు.. ఎన్‌సీఆర్‌బీ డేటాలో విస్తుగొలిపే విషయాలు..!

Napal Road Accident: నేపాల్‌లోని రౌతహత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు దుర్మరణం