మీరు తాగేవి మినరల్ వాటర్ కాదు గలీజ్ నీళ్లు..

మీ ఇంటికి వచ్చి వేసిన వాటర్ బాటిల్‌లోవి నిజంగా మినరల్ వాటరేనా?. ఎందుకైనా మంచిది తాగేముందు ఒకసారి చెక్ చేసుకోండి. మినరల్స్ మిక్స్ చెయ్యకపోయినా పర్వాలేదు…మంచి నీళ్లు అయితే బాగుండు అని ప్రార్థించండి. అవును హైదరాబాద్‌, విజయవాడల్లో వాటర్ దందా దర్జాగా సాగుతోంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా మినరల్ వ్యాపారం విస్తరిస్తోంది. మినరల్ వాటర్ పేరుతో జనం జేబుకు చిల్లు కొట్టడమే కాదు..మంచి నీరు సరఫరా చేయకుండా ఒళ్ళు కూడా గుళ్ల చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా […]

మీరు తాగేవి మినరల్ వాటర్ కాదు గలీజ్ నీళ్లు..
Follow us

|

Updated on: Nov 02, 2019 | 4:07 PM

మీ ఇంటికి వచ్చి వేసిన వాటర్ బాటిల్‌లోవి నిజంగా మినరల్ వాటరేనా?. ఎందుకైనా మంచిది తాగేముందు ఒకసారి చెక్ చేసుకోండి. మినరల్స్ మిక్స్ చెయ్యకపోయినా పర్వాలేదు…మంచి నీళ్లు అయితే బాగుండు అని ప్రార్థించండి. అవును హైదరాబాద్‌, విజయవాడల్లో వాటర్ దందా దర్జాగా సాగుతోంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా మినరల్ వ్యాపారం విస్తరిస్తోంది. మినరల్ వాటర్ పేరుతో జనం జేబుకు చిల్లు కొట్టడమే కాదు..మంచి నీరు సరఫరా చేయకుండా ఒళ్ళు కూడా గుళ్ల చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా సాగుతోన్న నీటి దందా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.

అసలు వాటర్ ప్లాంటులు రన్ చేయాలంటే ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..? మనం తాగే మినరల్ వాటర్ నాణ్యత ఎలా నిర్దారిస్తారు. ఎటాంటి టెస్ట్‌లు ల్యాబ్‌లో చేస్తారు. ఐఎస్‌ఓ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి..ఈ వీడియోలో చూద్దాం…

ఇక తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న మినరల్ వాటర్ మాఫియా దందాలపై టీవీ9 సమరభేరి మోగించింది. వరస కథనాలతో కల్తీ గాళ్ల వెన్నులో వణుకు పుట్టించింది. బోర్ వాటర్‌ను బాటిల్‌లో నింపి..బ్రాండెండ్ వాటర్‌గా కలరింగ్ ఇస్తోన్న కేటుగాళ్ల భరతం పడుతోంది టీవీ9. శుద్ద జలాల పేరుతో గొంతులో గరళం పోస్తోన్న బ్లడీ బద్మాశ్‌ల భాగోతం టీవీ9 ప్రజల ముందుకు తెస్తోంది. టీవీ9 వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. నిబంధనలు పాటించని వాటర్ ప్లాంటులపై దాడులు చేస్తున్నారు.