తమిళనాడులో హృదయవిదాకర ఘటన.. ఇంజనీరింగ్ చదివిన ఇద్దరు కూతుళ్లు.. తల్లిని కొట్టి చంపి, ఆ రక్తంలోనే ఆటలు..!

|

Jul 23, 2021 | 2:26 PM

తమిళనాడు రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పుడు మదనపల్లి.. ఇప్పుడు తిరునల్వేలి.. సేమ్‌ టు సేమ్‌.. ఇద్దరు కూతుళ్లు తల్లిని కడతేర్చిన దారుణ ఘటన తమిళనాడులో కలకలం...

తమిళనాడులో హృదయవిదాకర ఘటన.. ఇంజనీరింగ్ చదివిన ఇద్దరు కూతుళ్లు.. తల్లిని కొట్టి చంపి, ఆ రక్తంలోనే ఆటలు..!
Chennai Teacher Murder
Follow us on

Mother brautally Murdered in Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పుడు మదనపల్లి.. ఇప్పుడు తిరునల్వేలి.. సేమ్‌ టు సేమ్‌.. రెండింటికీ పెద్దగా వ్యత్యాసం లేదు. నాడు తల్లి ఇద్దరు కూతుళ్లను చంపేస్తే.. నేడు ఇద్దరు కూతుళ్లు తల్లిని కడతేర్చారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో కలకలం రేపింది.

తిరునెల్వేలి జిల్లా పాళయంకోటైకి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కోయిల్‌పిచ్చై, ఉషా (50) దంపతులకు కుమార్తెలు నీనా(21), రీనా(19) ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కోయిల్‌పిచ్చై మున్నీర్‌పల్లంలో ఉంటున్నాడు. నీనా, రీనా ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. కొద్ది నెలల క్రితం నుంచి కుమార్తెలు ఇరువురికి మతిస్థిమితం లేకుండా పోయింది.

మంగళవారం మధ్యాహ్నం ఉషాతో కుమార్తెలు గొడవపడ్డారు. కేకలు విని ఇరుగుపొరుగువారు ఉషా ఇంట్లోకి వచ్చి చూడగా ఆమె నిర్జీవంగా కనిపించింది. మతిస్థిమితం లేని ఆ పిల్లలు కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నారు. తల్లిని కొట్టి చంపి ఆ రక్తంలోనే ఆడుకోవడం కలిచివేస్తోంది. తల్లి రక్తాన్ని బొమ్మలకు పూస్తూ ఆడుకుంటుండడం స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. తిరునల్వేలి జిల్లా పళయంకొట్టైలోని కేటీసీనగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఇద్దరు కూతుళ్లకి మతిస్థిమితం లేదని చెబుతున్నారు స్థానికులు.

టీచర్ అయిన ఉష నిన్న ఉదయం నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానించారు. దీంతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసిన జనం తల్లడిల్లిపోయారు. పిల్లలు తల్లి వద్దకు రానివ్వకుండా అడ్డుకోవడంతో.. చేసేదీలేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు అక్కడి సీన్‌ చూసి షాక్‌కు గురయ్యారు. తల్లి రక్తపు మడుగులో ఉంటే.. పక్కన బొమ్మలతో ఆడుకుంటూ కనిపించారు ఇద్దరు కూతుళ్లు. దేవుడి బొమ్మలకు రక్తం పూస్తూ ఆడుకుంటున్న ఆ కూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా, పోలీసుల విచారణలో కత్తి, ఇనుపరాడ్‌తో దాడి చేయడం వల్లే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లిని హతమార్చిన మతిస్థిమితం లేని ఇద్దరు కుమార్తెలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also….

గుడిలో కుడికాలు పెట్టలేదని నవవధువు చెంప చెళ్ళుమనిపించిన ఆడపడుచు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Haj 2021: హజ్ యాత్రలో యాత్రీకుల భద్రత కోసం తొలిసారిగా మహిళా సైనికులు సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం