Hyderabad: వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం

హైదరాబాద్‌ బోరబండలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం బయటపెడతామని భయపెట్టి వివాహితను వేధించి.. అత్యాచారానికి పాల్పడ్డారు.

Hyderabad: వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం
Harassment

Edited By:

Updated on: Dec 19, 2021 | 7:12 PM

హైదరాబాద్‌ బోరబండలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం బయటపెడతామని  భయపెట్టి వివాహితపై ఇస్మాయిల్‌ అనే వ్యక్తి, మరో బాలుడు అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… ఓ యువకుడితో వివాహితకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని గుర్తించి ఇస్మాయిల్‌ బ్లాక్‌మెయిల్ చేశాడు. వీడియోలు బయటపెడతామని బెదిరించాడు. వీడియోలు అడ్డుపెట్టుకుని ఇస్మాయిల్‌‌తో పాటు మరో బాలుడు వివాహితపై అత్యాచారం చేశారు.

పదేపదే బెదిరిస్తుండటంతో వివాహిత విసిగిపోయింది. వికారాబాద్‌ వెళ్లి తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగింది. పురుగులమందు తాగిన మహిళ, యువకుడిని స్థానికులు కాపాడారు. చికిత్స అనంతరం వారిద్దర్నీ పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది. విచారణలో వేధింపులు, అత్యాచారం విషయాన్ని వివాహిత వివరించింది. దీంతో బోరబండకు చెందిన మైనర్ బాలుడు, ఇస్మాయిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

Viral: ఓర్నీ ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లిన దొంగలు..పోలీసులు షాక్‌!

కొబ్బరి కాయల మధ్య దాగుంది.. కూలీలు వెళ్లగానే ఒక్కసారిగా..