Tirupati district: చట్టాలు ఎన్ని వస్తున్నా.. కామాంధులు మారడం లేదు. తాజాగా కుమార్తె ఫ్రెండ్‌పైనే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా గూడూరు రూరల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్‌ఐ తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు రూరల్ పరిధిలోని వేములపాళెం(Vemulapalem)లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇతని కుమార్తె ఓ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే కాలేజీలో గూడూరుకు చెందిన మరో 16 ఏళ్ల బాలిక కూడా చదవుతుంది. వెంకటేశ్వర్లు కుమార్తెకు.. ఈ బాలిక ఫ్రెండ్. బుధవారం ఈ విద్యార్థిని కాలేజ్‌కు వెళ్లడం కాస్త లేటయ్యింది. అప్పటికే తన కూతురును కాలేజీలో దిగబెట్టిన వెంకటేశ్వర్లు.. ఆ బాలిక రాకను గుర్తించి మాయమాటలు చెప్పాడు. అనంతరం రూరల్ ఏరియాలోని పారిచెర్ల వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఇంతలో అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కేకలు వేయడంతో వెంకటేశ్వర్లు పరారయ్యాడు. బాలిక అక్కడి నుంచి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనపై టూ టౌన్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. ఆ మేరకు బాలికను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతయ్య వెల్లడించారు.
Also Read: Viral: ఇంట్లో ఎవరూ లేరు వచ్చేమంది.. కింగ్‌లా అక్కడికి వెళ్లిన కుర్రాడికి దిమ్మతిరిగే షాక్..