వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కుటుంబం పరువు పోతుందని, తనతో ఇకపై మాట్లాడవద్దని కోరడమే ఆ మహిళ పాలిట మృత్యుపాశమైంది. పుణెలో ఓ యువకుడు తన వివాహితను దారుణంగా హతమార్చాడు. మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని లోహెగావ్ ప్రాంతంలో బిహార్ కు చెందిన గులాం షేక్ అనే యువకుడు నివాసముండేవాడు. అతనికి దగ్గర్లోని మరో ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబసభ్యులు.. ప్రవర్తన మార్చుకోవాలని సదరు మహిళను హెచ్చరించారు. కుటుంబసభ్యుల హెచ్చరికతో మహిళ యువకుడితో సంబంధాన్ని తెంచుకునేందుకు సిద్దమైంది. తనతో మాట్లాడవద్దని, కలవాలని ప్రయత్నించవద్దని కోరింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన గులాం షేక్.. మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో మహిళపై దాడి చేశాడు. దాడి ఘటనలో మహిళ మృతి చెందింది. గులాం షేక్ పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త రఘునాథ్ సూర్యవంశీ.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గులాం షేక్ తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుడి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను వెతకడానికి పోలీసులు ఇప్పటికే బిహార్‌కు వెళ్లారని, త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
Also Read
Health Ministry Canteen: ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాంటీన్‌లో జంక్ ఫుడ్‌కు స్వస్తి.. ఆరోగ్యకరమైన ఆహారం
Trees Exploding: అక్కడ అర్ధరాత్రి చెట్లు పేలిపోతున్నాయి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..?
WHO Warning: తదుపరి కోవిడ్ వేరియంట్ తీవ్రతరం కావచ్చు.. డబ్ల్యూహెచ్ హెచ్చరిక..!