Matrimony Fraud: మాట్రిమోనీ సైట్ పేరుతో 200 మందికిపైగా యువతులకు టోకరా పెట్టాడు ఓ కేటుగాడు. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్(Lock Down) అందరికీ భయాన్ని ఇస్తే వాడికి మాత్రం అది మంచి డబ్బును తెచ్చిపెట్టింది. ఇందుకోసం రెండేళ్ల క్రితం లాక్డౌన్ సమయంలో ఓ వెబ్‌సైట్‌ను(Website) ప్రారంభించాడు నిందితుడు. మంచి సంబంధాలు కుదుర్చుతానంటూ అనేకమంది యువతులకు వల వేశాడు. అసలు కథ ఇప్పుడే మెుదలైంది.. వివాహం చేసుకోవాలనుకునే వారికి జాతక దోషాలు ఉన్నాయని, అవి సరిచేసేందుకు పూజలు చేయిస్తానని నమ్మబలికి వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసేవాడు.
డబ్బులు తన ఖాతాలో పడ్డగానే ఎవరికి కాల్స్ కు స్పందించేవాడు కాదు. డబ్బులు ఇచ్చిన బాధితులు ఒత్తిడి చేస్తే వారి నుంచి తప్పించుకునేందుకు తాను చనిపోయినట్లు నాటకం ఆడేవాడు. సోషల్ మీడియా, వెబ్సైట్లలో తన ప్రొఫైల్ ఫొటోను మార్చేసేవాడు. చనిపోయాడని నమ్మించడానికి దండ వేసి ఉన్న ఫొటోను పెట్టేవాడు. దీంతో చాలా మంది యువతులు అది నిజమేననుకుని నిందితుడిని వదిలేశారు. అయితే ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుతో సీన్ రివర్స్ అయింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడిని గజియాబాద్‌కు చెందిన తరుణ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి..
HUL Investment: హిందూస్తాన్ యూనిలివర్ ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఏమిటంటే..
Cooking Oil: వంటనూనె ధరలు ఇప్పట్లో దిగివస్తాయా? వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి..