AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్‌టాక్ మోజుతో స్టంట్లు వేసిన కొత్తపెళ్లి కొడుకు…

కాలక్షేపంగా ఉండాల్సిన టిక్‌టాక్‌ ఇప్పుడు ప్రాణాల మీదికి తెస్తోంది. ఈ టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరిస్తూ ఎన్నో ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.. అయినా కూడా యువత టిక్ టాక్ వీడియోలు చేయడం మానటం లేదు. తాజాగా టిక్‌టాక్‌ వీడియో కోసం స్టంట్లు చేస్తున్న కొత్త పెళ్లికొడుకు...

టిక్‌టాక్ మోజుతో స్టంట్లు వేసిన కొత్తపెళ్లి కొడుకు...
Jyothi Gadda
|

Updated on: Mar 12, 2020 | 12:50 PM

Share

టిక్‌టాక్..ఎక్కడ చూసినా,..ఎవరినీ మందలించిన టిక్‌టాక్‌లో బిజీగా కనిపిస్తున్నారు. ఇదో మాయదారి యాప్..దీనివల్ల ఉద్యోగాలు పోతున్నా.. సంసారాలు నాశనమవుతున్నా..చివరకు ప్రాణాలు పోతున్నా..పట్టించుకునే నాధుడే లేడు. ఈ టిక్‌టాక్‌ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్‌టాక్‌ ఇప్పుడు ప్రాణాల మీదికి తెస్తోంది. ఈ టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరిస్తూ ఎన్నో ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.. అయినా కూడా యువత టిక్ టాక్ వీడియోలు చేయడం మానటం లేదు. తాజాగా టిక్‌టాక్‌ వీడియో కోసం స్టంట్లు చేస్తున్న కొత్త పెళ్లికొడుకు దుర్మరణం పాలైన ఘటన యూపీలో వెలుగుచూసింది.

యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. రెండు నెలల క్రితమే వివాహమైన ఓ వ్యక్తి టిక్‌టాక్ స్టంట్లు చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కొల్పోయాడు. హోలీ వేడుకల సందర్భంగా కిందిదియా గ్రామంలో ట్రాక్టర్‌ నడుపుతూ స్టంట్స్‌ పెర్‌ఫామ్‌ చేస్తుండగా మరో వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. అయితే స్టీరింగ్‌పై పట్టుతప్పిన క్రమంలో ట్రాక్టర్‌ బోల్తాపడింది. ట్రాక్టర్‌ అదుపుతప్పడంతో ముందు టైర్లకు వేలాడిన బాధితుడు వాహనం కింద పడి మరణించినట్లుగా స్థానికులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై మృతుడి కుటుంబసభ్యులు గానీ, స్థానికులు గానీ పోలీసులకు సమాచారం అందించలేదు. పోస్టుమార్టం, పోలీసు కేసు ఏదీ లేకుండానే మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం.

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి