Chicken Pakodi: చికెన్ పకోడి చిచ్చు.. భార్యపై కత్తితో భర్త దాడి.. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్

|

Aug 02, 2022 | 2:05 PM

అన్యోన్యంగా సాగిపోతున్న వారి సంసారంలో చికెన్ పకోడి (Chicken Pakodi) చిచ్చు రేపింది. రుచిగా లేదన్న ఒకే ఒక్క కారణంతో అమాంతం కోపం పెంచేసుకున్నాడు భర్త. అంతటితో ఆగకుండా భార్యను చావబాదాడు. కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత..

Chicken Pakodi: చికెన్ పకోడి చిచ్చు.. భార్యపై కత్తితో భర్త దాడి.. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్
Chicken Pakodi Crime
Follow us on

అన్యోన్యంగా సాగిపోతున్న వారి సంసారంలో చికెన్ పకోడి (Chicken Pakodi) చిచ్చు రేపింది. రుచిగా లేదన్న ఒకే ఒక్క కారణంతో అమాంతం కోపం పెంచేసుకున్నాడు భర్త. అంతటితో ఆగకుండా భార్యను చావబాదాడు. కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత తీవ్ర భయాందోళనకు గురై చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కర్నాటక రాజధాని బెంగళూరు (Bangaluru) నగరంలోని అరెకెరే లే ఔట్ లో నివాసముండే సురేశ్.. బొమ్మనహళ్లిలోని ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. గత గురువారం భార్య షాలినిని చికెన్ పకోడి చేయమని కోరి ఆఫీస్ కు వెళ్లాడు. దీనికి ఆమె అంగీకరించి సాయంత్రం సురేశ్ వచ్చే సమయానికి చికెన్ పకోడా చేసి రెడీగా ఉంటింది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తకు చికెన్ పకోడీ వడ్డించింది. అది తిన్న సురేశ్ కు చికెన్ పకోడి రుచి నచ్చలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై భార్య షాలినీని తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో షాలిని తల, చేతులపై గాయాలయ్యాయి. అనంతరం సురేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

భయాందోళనతో షాలిని కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమయ్యారు. వారి ఇంటికి వచ్చి చూసే సరికే షాలినికి తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి షాలిని వాంగ్మూలం తీసుకున్నారు. సురేశ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. షాలినిపై దాడి చేసిన పరారైన సురేశ్ కోసం గాలిస్తున్న పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. సురేశ్ తన ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై దాడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి