హైదరాబాద్(Hyderabad)లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12 దారుణం జరిగింది. ఓ వ్యక్తి దారుణ హత్య(Murder)కు గురయ్యాడు. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్(Beer bottle)తో కడుపులో పొడిచి వ్యక్తిని హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో గొడవ.. ఆపై హత్య చేసి పరారై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నగరంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న హత్యలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ నెల 4వ తేదీన సరూర్‌నగర్ మున్సిపాలిటీకి సమీపంలో.. నాగరాజును అతని భార్య సోదరులే హత్య చేసిన ఘటన సంచలంగా మారింది. అందురు చూస్తుండగానే ఈ హత్య జరగడం గమనార్హం. జనవరి 31న ఆశ్రీన్ సుల్తానా, నాగరాజులు ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆశ్రీన్ సోదరులకు నచ్చలేదు. దీంతో నాగరాజును కాపు కాచి హత్య చేశారు. నాగరాజును హత్య చేసిన ఆశ్రీన్ ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మర్డర్ విషయంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also.. Mahbubnagar Attack: దారుణం.. వంట పాత్రలు కడగమన్నందుకు తల్లిపై కూతురు కర్కశత్వం.. గొంతు కోసి..