ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇందులో ప్రేమికుడు చనిపోగా ప్రేమికురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం దెగామ గ్రామానికి చెందిన గోడెం శ్రీరామ్ అదే గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఒకే కులానికి చెందిన వీరిద్దరు పెద్దల ఒప్పందంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఇద్దరు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు గమనించగా అప్పటికే శ్రీరామ్ మృతిచెందగా యువతిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Murder in Khairtabad: భర్త మెడకు చున్నీ బిగించి చంపేసిన భార్య.. కారణాలు ఇలా ఉన్నాయి..