మ‌హ‌బూబాబాద్: వ్య‌వ‌సాయ బావిలో దూకి ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌.. ప్రేమ విష‌యం ఇంట్లో తెలిసింద‌ని ఈ అఘాయిత్యం

ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాజుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్ల అమృతండా సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి...

మ‌హ‌బూబాబాద్: వ్య‌వ‌సాయ బావిలో దూకి ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌.. ప్రేమ విష‌యం ఇంట్లో తెలిసింద‌ని ఈ అఘాయిత్యం
Suicide

Updated on: Dec 23, 2020 | 11:42 AM

ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాజుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్ల అమృతండా సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ప్రశాంత్, ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మంలో పదో తరగతి చదువుతున్న ప్రశాంత్ డిగ్రీ చదువుతున్న ఓ యువతి (21) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీని ప్రేమ విషయం సోమవారం సాయంత్రం ఇంట్లో తెలియడంతో వీరిద్దరు ఆందోళనకు గురయ్యారు.

దీంతో ప్రేమ జంట ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం తండా శివారులో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న వారు బావిలో శవాలను చూసి తండా వాసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న తండా వాసులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులిద్దరూ తండా వాసులేనని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us