కంచె చేను మేసిన చందంగా..మారింది ఓ అవినీతి అధికారి భాగోతం. అవినీతి, అన్యాయాన్ని అరికట్టాల్సిన పోలీసు ఉద్యోగే లంచావతారమెత్తాడు. కర్నూలు సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్య నాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగరానికి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి ఓ కేసు విషయంలో వెంటనే అరెస్టు చేయకుండా, మరో కేసులో గోపాల్ అనే వ్యక్తి పై రౌడీషీట్ తెరవకుండా చంద్రశేఖర్ రెడ్డి అనే న్యాయవాది మధ్యవర్తిగా ఇరువురి వద్ద నుంచి 40వేల రూపాయలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. విషయం ముందుగానే తెలుసుకున్న ఏసీబీ అధికారులు పథకం ప్రకారం మాటువేసి లాయర్‌తో పాటు సీఐ రామయ్య నాయుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. లాయర్‌ని అదుపులోకి తీసుకొని అధికారిక అనుకూల పత్రాలనూ సిఐ నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.