Hyderabad: మద్యం తాగుతుండగా స్నేహితుల మధ్య గొడవ.. చివరకు బీర్‌ బాటిల్ పగలగొట్టి..

రౌడీ షీటర్ను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రౌడీ షీటర్ను గొంతులో బీర్ బాటిల్స్‌తో పొడిచి బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశారు నిందితులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్యకు పాల్పడింది మృతుడి స్నేహితులేనని ప్రాథమికంగా నిర్థారించారు.

Hyderabad: మద్యం తాగుతుండగా స్నేహితుల మధ్య గొడవ.. చివరకు బీర్‌ బాటిల్ పగలగొట్టి..
Hyd Murdered

Edited By: Anand T

Updated on: Jun 30, 2025 | 2:16 PM

ముగ్గురు స్నేహితుల మద్యం సేవిస్తుండగా తలెత్తిన గొడవ ఒకరి ప్రాణాలు తీసే వరకు చేరింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన సయ్యద్ తన స్నేహితులతో కలిసి ఓ బర్త్‌డే  పార్టీకి హాజరయ్యారు. ఆ తర్వాత తిరిగి బోరుబండకు వెళుతున్న సమయంలో సాజిత్ మున్నా అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వివేకానంద నగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక నిర్మాణుష్య ప్రదేశంలో మద్యం సేవించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ముగ్గురు మధ్య గొడవ తలెత్తింది.

దీంతో రెచ్చిపోయిన సయ్యద్ మొదట ఇద్దరి స్నేహితులపై దాడికి ప్రయత్నించినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో సయ్యద్‌ తమపై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. మిగిలిన ఇద్దరు స్నేహితులు తమ చేతిలో ఉన్న బీర్ బాటిల్‌తో సయ్యద్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. బీర్‌బాటిల్‌తో సయ్యద్ గొంతు కోసి, ఆ తర్వాత బండరాయితో తలపై మోది హత్య చేసినట్టు సమాచారం. ఈ ఘటన ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.

ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా మృతుడు బోరబండకు చెందిన వాహిద్ పహిల్వాన్ కొడుకు సయ్యద్గా గుర్తించారు. అయితే సయ్యద్ పై అల్లాపూర్‌లోని ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు పాల్పడిన నిందితులు సాజిత్, మున్న ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.