IAS Officer Srilakshmi : ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో తనపేరును తొలగించాలంటూ సీబీఐ కోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల లీజు మంజూరులో నిబంధనలో మేరకే వ్యవహరించానని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. సీబీఐ తనను ఈ కేసులో అనవసరంగా ఇరికించిందన్నారు.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆరో నిందితురాలిగా ఉన్నారు. గనుల లీజు మంజూరులో నిబంధనల మేరకే వ్యవహరించానని పిటిషన్లో వెల్లడించారు. ప్రభుత్వ అధికారిగా తన విధులు నిర్వహించానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పిటిషన్‌పై విచారణను సీబీఐ న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది.
ఇదిలావుంటే.. శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ ప్రమోషన్ ఇచ్చింది. ఇటీవల శ్రీలక్ష్మి పురపాలక శాఖ కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టారు. అయితే కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుతుందని … తుది తీర్పులకు లోబడే ఉత్తర్వల కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
శ్రీలక్ష్మి ఇటీవల తెలంగాణ నుంచి రిలీవై ఏపీ కేడర్‌లో చేరారు. డిప్యుటేషన్ మీద ఆమె తెలంగాణ నుంచి ఏపీకి రావాలని శ్రీలక్ష్మి ముందుగా అనుకున్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె తన కేడర్‌ను ఏపీ మార్చుకున్నారు. క్యాట్ ఆదేశాల మేరకు తెలంగాణ సర్కార్ రిలీవ్ చేశారు. ఇటీవల ఆమె అమరావతిలోని జీఎడీలో రిపోర్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రోజు.. అఖరి నిమిషం ఇలా.. గన్ సల్యూట్ కోసం భారీ ఏర్పాట్లు