Hyderabad: ఆటోను తప్పించబోయి నుజ్జు నుజ్జు అయిన కారు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

హైదరాబాద్ నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది.

Hyderabad: ఆటోను తప్పించబోయి నుజ్జు నుజ్జు అయిన కారు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
Car Accident

Updated on: Aug 12, 2021 | 5:33 PM

Hyderabad Road Accident: హైదరాబాద్ నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. రాజేంద్రనగర్ సమీపంలోని గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యార. మృతి చెందిన వారిని సుచిత్రకు చెందిన కౌశిక్, జో డౌన్‌గా పోలీసులు గుర్తించారు. గండిపేట సీబీఐటి కాలేజ్ రోడ్డులో అతి వేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

గండిపేట నుంచి నార్సింగ్ వైపు కారులో ఐదుగురు విద్యార్థులు వెళ్తున్నారు. కారు నడిపే సమయంలో రోడ్డు మీద ఆటో అడ్డుగా వచ్చింది. దీంతో ఆటోను తప్పించబోయి కరెంటు స్తంభాన్ని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సీబీఐటీ కాలేజీలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన కౌశిక్ మృత్యువాత పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు.. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూ రాసిన మాజీ ఉద్యోగి.. పరువు నష్టం దావాతో షాకిచ్చిన కంపెనీ.. ఎంతో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us