Jogulamba Gadwal district: తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అయిజ మండలంలోని కొత్తపల్లిలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి గుడిసె కూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తల్లిదండ్రులతో పాటు ముగ్గురు చిన్నారులు సజీవ సమాధి కావడంతో కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అయితే.. తీవ్రగాయాలతో మరో ఇద్దరు బయటపడ్డారు.
శనివారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి గుడిసె కూలినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కొత్తపల్లికి చేరుకుని వివరాలు సేకరించారు. మరణించిన వారిలో.. పులిఎద్దుల మోసా, శాంతమ్మ, వారి కుమారులు చరణ్ (12 ), తేజ (10 ), రాజు( 8) ఉన్నారు. అయితే.. గాయాలతో కూతురు, మరో కొడుకు బయటపడినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: