Uttar Pradesh: భార్యను మరొకరితో సన్నిహితంగా చూసిన భర్త.. కోపంలో దారుణ నిర్ణయం..

|

Apr 14, 2022 | 5:17 PM

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడానికి చూడడాన్ని తట్టుకోలేని ఓ భర్త సదరు వ్యక్తిపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అతను మరణించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి...

Uttar Pradesh: భార్యను మరొకరితో సన్నిహితంగా చూసిన భర్త.. కోపంలో దారుణ నిర్ణయం..
Follow us on

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడానికి చూడడాన్ని తట్టుకోలేని ఓ భర్త సదరు వ్యక్తిపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అతను మరణించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని మహోబా జిల్లాలోని మౌదాహా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.

తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి భర్తలేని సమయంలో భార్య సంతోష్‌ అనే మరో వ్యక్తితో సన్నిహితంగా చూడడం గమనించాడు నిందితుడు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన అతను గొడ్డలితో సంతోష్‌పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడి చేస్తున్న సమయంలో గట్టిగా అరవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులంతా తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే సంతోష్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో ఈ సంఘనట కాస్త స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

Also Read: K.G.F Chapter 2: సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ మేకర్స్.. చాప్టర్ 2 ఎండింగ్‌లో ఊహించని ట్విస్ట్

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

Hindu Mythology: దేవుడికి తలనీలాలు సమర్పించడం వెనుక రీజన్.. పుణ్యక్షేత్రంలో కేశఖండన ప్రాంతాన్ని ‘కల్యాణకట్ట’ అని ఎందుకు అంటారంటే..