కామారెడ్డిలో దారుణం.. అత్తను చంపిన అల్లుడు.. భార్య ఫిర్యాదుతో నిజాలు వెలుగులోకి..

Husband kills wifes mother: భార్యను కలవనివ్వడం లేదని ఓ అల్లుడు అత్తను కడతేర్చాడు. అనంతరం ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు కట్టుకథ అల్లాడు. కూతురి ఫిర్యాదుతో రంగంలోకి..

కామారెడ్డిలో దారుణం.. అత్తను చంపిన అల్లుడు.. భార్య ఫిర్యాదుతో నిజాలు వెలుగులోకి..
Murder

Updated on: Mar 06, 2021 | 1:12 PM

Husband kills wifes mother: భార్యను కలవనివ్వడం లేదని ఓ అల్లుడు అత్తను కడతేర్చాడు. అనంతరం ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు కట్టుకథ అల్లాడు. కూతురి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రీపోస్టు మార్టం నిర్వహించి ఆమెది సహజ మరణం కాదని హత్యనంటూ నిగ్గుతేల్చారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే నజిమా బేగం (48) 75 రోజుల క్రితం మృతి చెందింది. అయితే నజిమా బేగంను ఆస్తి కోసం తన భర్త వెంకటస్వామి, మేనమామ షఫీలు హత్య చేశారని అస్మా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో మృతురాలి స్వగ్రామం తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిలో నజిమా మృతదేహానికి పోలీసుల ఆధ్వర్యంలో వైద్యులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. అయితే నజీమాది సహజ మరణం కాదని వైద్యులు నిర్థారించారు.

అనంతరం వెంకటస్వామి, షఫీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో అల్లుడు వెంకటస్వామి గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. భార్య అస్మా బేగంను కలవనివ్వడం లేదని అత్తపై కక్ష పెంచుకున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు స్వామిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కామారెడ్డి పట్టణ పట్టణ సీఐ మధుసూదన్ వెల్లడించారు. దీనిపై మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని.. ఆతర్వాత విచారణలో ఈ నిజాలు వెలువడినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

మంత్రి కేటీఆర్‌ పీఏను అంటూ వసూళ్ల దందా.. నిందితుడు మాజీ రంజీ ప్లేయర్.. రెండు రాష్ట్రాల్లో 7 కేసులు

ఏపీ అధికార పార్టీలో అలజడి రేపుతున్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్స్‌.. ఇంతకీ ఆ మంత్రి, ఎమ్మెల్యే చేసిన తప్పేంటి..?