డబ్బు కోసం మనుషులు అడ్డదార్లు తొక్కుతున్నారు. కాసుల కక్కుర్తిలో పడి కనీసం బంధుత్వాలు, భాందవ్యాలు కూడా మర్చిపోతున్నారు. భార్య మరణిస్తే.. ఆమె పేరు మీదున్న ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని ఆశపడ్డ ఓ వ్యక్తి పక్కా ప్రణాళిక ప్రకారం ఆమెను చంపి.. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ ఘటన గుజరాత్ బనాస్కాంఠా జిల్లా భిల్దీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ బనాస్కాంఠా జిల్లాకు చెందిన లలిత్ తంక్ .. చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. భార్య దక్షబెన్ తంక్ పేరుతో భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. ఆపై ఆమె చనిపోతే రూ. 60లక్షలు వస్తాయని కనీసం మానవత్వం లేకుండా అంతమొందించేందుకు ప్రణాళిక రూపొందించాడు. ఆమెను చంపేందుకు ఒకరితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు
డిసెంబర్ 26న దక్షబెన్ను గుడికి తీసుకెళ్లాడు లలిత్. పక్కా ప్లాన్ ప్రకారం .. ఆ వ్యక్తికి ఫోన్ చేసి తాము రోడ్డు మీద నడుస్తున్న సమయంలో.. వాహనంతో వేగంగా వచ్చి తన భార్యను ఢీ కొట్టమని చెప్పాడు. లలిత్ చెప్పినట్టే చేశాడు ఆ వ్యక్తి. ఆమె స్పాట్‌లోనే చనిపోయింది.
క్రూరుడు ఎలా చిక్కాడంటే..?
తొలుత.. యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసుకున్నారు భిల్దీ స్టేషన్ పోలీసులు. కానీ దక్షబెన్ మరణంపై.. ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. లలిత్‌పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో రివర్స్ విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీటీవీలను, కాల్ డేటాను పరిశీలించారు. చివరికి.. అది యాక్సిండ్ కాదని ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని నిర్ధారించారు. లలిత్‌ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతనికి సహకరించిన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read:
ఎంత విడ్డూరం సుమీ..! సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది… ఆ తర్వాత ఏం జరిగిందంటే..?