Kerala Gold, Dollar Smuggling Case: కేరళ గోల్డ్ స్కామ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. కోట్ల రూపాయల విలువజేసే భారీ గోల్డ్ స్కామ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్.. కేరళ సీఎం విజయన్‌పై సంచలన ఆరోపణలు చేసినట్లు వెల్లడించింది కస్టమ్స్ డిపార్ట్‌మెంట్. స్వప్న సురేష్ ఇచ్చిన ఆధారాలతో కేరళ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించనుంది. సీఎంతో పాటు ఆయన సన్నిహితులపైనా సంచలన ఆరోపణలు చేశారు స్వప్న సురేష్.
జులై 5న త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌కు దుబాయ్ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
స్మగ్లింగ్ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ అండగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్వప్న సురేశ్‌ను కేసు నుంచి తప్పించడానికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని కూడా ఆరోపణలొచ్చాయి.
అతడో గోల్డ్‌మెడలిస్ట్.. చేస్తున్నవి మాత్రం రోల్డ్‌గోల్డ్ పనులు.. నీట్ ఎగ్జామ్ రాసినవారే ఇతగాడి టార్గెట్..
ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సర్కస్ ఫీట్లు.. అదిరిందన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ..
ఉక్కు ఆందోళన: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు.. ఏపీవ్యాప్తంగా బంద్..