ముంబయిలో (Mumbai) దారుణ ఘటన జరిగింది. ఓ బాలిక డ్రైవర్ తో కలిసి, తన తల్లిని, సొంత అక్కను దారుణంగా చంపేసింది. అనంతరం డ్రైవర్ తో కలిసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ముంబయిలోని కందివలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో నాలుగు మృతదేహాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంట్లో లభించిన లేఖలో ఇద్దరిని హత్య చేసి, తాము ఆత్మహత్య చేసుకున్నట్లు రాసి ఉంది. శివ్ దయాల్ సేన్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి భూమి అనే బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ విషయంపై ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో ఆ బాలిక తన తల్లిని, అక్కను చంపేయాలని నిర్ణయించారు. ముందస్తు పథకం ప్రకారం ఇద్దరినీ హత్య చేసింది. అనంతరం డ్రైవర్ తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నలుగురూ చనిపోయిన రెండు అంతస్తుల భవనం ఇల్లు, ఆస్పత్రిగా ఉంది. హత్యకు గురైన వారిని కిరణ్ దాల్వి, ఆమె కూతురు ముస్కాన్గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న చిన్న కుమార్తె పేరు భూమి, డ్రైవర్ పేరు శివ్దయాల్సేన్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కందివలి(వెస్ట్)లోని దేనా బ్యాంక్ జంక్షన్లో ఓ వ్యక్తి కొడవలి పట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ప్రాంతానికి చేరుకోగా దాల్వి హాస్పిటల్ భవనంలోకి కొడవలితో హల్ చల్ చేస్తున్న వ్యక్తి, ఇద్దరు మహిళలు వెళ్లారని, ఆ తర్వాత లోపలి నుంచి అరుపులు కేకలు వినిపించిట్లు స్థానికులు చెప్పారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని శతాబ్ది ఆస్పత్రికి తరలించారు.