జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇవాళ పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు
JC Prabhakar Reddy

Updated on: Aug 16, 2020 | 11:52 AM

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇవాళ పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ కడప సెంట్రల్ జైలు నుంచి జేసీ ప్రభాకర్‌ను అనంతపురం తీసుకొచ్చిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచే విచారణ ప్రారంభమైంది.

ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆయన తరపు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించేందుకు ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 6న వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగం కేసులో బెయిల్‌పై విడుదలై తాడిపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్రకుమార్‌ కరోనా నేపథ్యంలో ఊరేగింపును అడ్డుకున్నారు. దీంతో సీఐపై కులం పేరుతో దూషించారనే ఆరోపణలపై ఆయనపై తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రెడ్డిని ఇవాళ విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Loading...
Unable to load recommendations.
Follow Us