కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ ట్యాంక్ పేలిన ఘటనలో మరొకరి మ‌ృతి

నెల్లూరు జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారిలో మరో వ్యక్తి మరణించాడు. రియాక్టర్ ట్యాంక్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న..

కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ ట్యాంక్ పేలిన ఘటనలో మరొకరి మ‌ృతి

Updated on: Jul 31, 2020 | 2:32 PM

నెల్లూరు జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారిలో మరో వ్యక్తి మరణించాడు. రియాక్టర్ ట్యాంక్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ అనే బాధితుడు శుక్రవారం మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. పేలుడులో గాయపడ్డ నలుగురు కార్మికుల్లో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతుడు రజనీకాంత్ స్వస్థలం ఏఎస్‌పేట మండలం చిన్న అబ్బిపురం గ్రామంగా గుర్తించారు.

నెల్లూర్ జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియలో గల కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. కంప్రెషర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న నలుగురు కార్మికులు గాయపడ్డారు. వెంటనే వారిని నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. అగ్నికీలలు ఇతర యూనిట్లకు కూడా వ్యాపించాయి. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us