Sexual Harassment: మహిళా ఉద్యోగిపై తీవ్ర ఒత్తిడి.. సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజుపై లైంగిక వేధింపుల కేసు

|

Oct 24, 2021 | 8:18 AM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కొన్ని రోజులుగా తన కోరిక తీర్చాలంటూ

Sexual Harassment: మహిళా ఉద్యోగిపై తీవ్ర ఒత్తిడి.. సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజుపై లైంగిక వేధింపుల కేసు
Eluru District Registrar Of
Follow us on

Sub-Registrar Sexual Harrasment: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కొన్ని రోజులుగా తన కోరిక తీర్చాలంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ జయరాజు లైంగికంగా వేధిస్తున్నాడని దిశా పోలీసులకు ఫిర్యాదు చేశారు రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ మహిళా ఉద్యోగి. కాగా, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న జయరాజును మహిళా ఉద్యోగిని ఫిర్యాదుతో కొన్ని రోజుల క్రితమే ఉన్నతాధికారులు మందలించినట్టు తెలుస్తోంది.

అయినా కాని, సబ్ రిజిస్ట్రార్ జయరాజు ప్రవర్తనలో మార్పు రాకపోగా.. కోరిక తీర్చకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని సదరు మహిళా ఉద్యోగిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉన్నతాధికారుల సూచనల మేరకు దిశా పోలీస్‌ స్టేషన్‌లో మహిళా ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో కేసు నమోదు చేసిన దిశా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..