Prakasam: కుమార్తెను చెరబట్టిన కన్నతండ్రి.. పలుమార్లు అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి

|

Jul 15, 2021 | 12:21 PM

Father raped his Daughter: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. ఆ బాలికపై కన్నేశాడు. 15 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని

Prakasam: కుమార్తెను చెరబట్టిన కన్నతండ్రి.. పలుమార్లు అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి
Andhra Pradesh Crime
Follow us on

Father raped his Daughter: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. ఆ బాలికపై కన్నేశాడు. 15 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా ఇల్లు నిర్మించుకకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లి గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అప్పటి నుంచి పలు దఫాలుగా అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయం బయటికు చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ కసాయి తండ్రి బెదిరించేవాడు. ఈ క్రమంలో తండ్రి తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్‌ చేసింది. పోలీసులు వెళ్లి తండ్రిని మందలించారు. ఆ తరువాత బాలిక తాత ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి పక్కన ఎవరూ లేకపోవడంతో.. ఇంతకాలం బాలిక తండ్రికి భయపడి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Also Read:

విషాదం.. ఆలయ కొలనుకు వెళ్లి ప్రమాదవశాత్తూ ఐదుగురు మృత్యువాత.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు

Cake Drugs: సైకాలజిస్ట్ నయా దందా.. కేకుల్లో డ్రగ్స్‌ పెట్టి రేవ్ పార్టీలకు సరఫరా.. విచారణలో షాకింగ్ నిజాలు