Cybercrime fraud: సైబర్ నేరగాళ్లకు వరంలా మారిన లాక్‌డౌన్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో ఘరానా మోసం.. ఒకరు కాదు ఇద్దరు కాదు 54 మందికి టోకరా!

|

Jun 19, 2021 | 3:20 PM

కరోనా లాక్‌డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. బంధువుల్లా,స్నేహితుల్లాగా మెసేజ్‌లు పంపించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగాన్ని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు

Cybercrime fraud: సైబర్ నేరగాళ్లకు వరంలా మారిన లాక్‌డౌన్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో ఘరానా మోసం.. ఒకరు కాదు ఇద్దరు కాదు 54 మందికి టోకరా!
Cyber Crime
Follow us on

Fake Job Portals Cheated: కరోనా లాక్‌డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. బంధువుల్లా,స్నేహితుల్లాగా మెసేజ్‌లు పంపించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగాన్ని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో జాబ్ మేళా పేరుతో భారీ మోసం వెలుగుచూసింది.

టీసీఎస్‌లో కొత్తగా ఓపెనింగ్స్‌ ఉన్నాయి. పుణేలో ఇన్ఫోసిస్‌ కంపెనీ హైదరాబాదీయులకు ప్రాధాన్యత ఇస్తోంది. మైక్రోసాఫ్ట్‌లో ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగాలున్నాయి. వెంటనే దరఖాస్తు చేయండి’ అంటూ ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు సైబర్‌ నేరస్థులు కొలువుల వల విసురుతున్నారు. కోవిడ్‌ వేళ ప్రముఖ బహుళజాతి సంస్థల్లో కొత్త ఉద్యోగాలున్నాయంటూ నమ్మిస్తున్నారు. రూ.లక్షల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. తీరా జాబ్ ఎప్పుడిస్తారాని నిలదీయంతో అసలు బండారం బయటపడింది.

ఇలా రెండు నెలల్లో 54 మంది వారి వలలో చిక్కుకోగా, రూ.1.20 కోట్లు సైబర్‌ నేరస్థుల వశమైంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలున్నాయంటే వెంటనే నమ్మొద్దని, ప్రముఖ కంపెనీలు అభ్యర్థుల నుంచి నేరుగా డబ్బు కట్టించుకోవన్న విషయాలను గమనించాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఢిల్లీ.. నోయిడాల్లో ఇలాంటి ముఠాలు పదుల సంఖ్యలో ఉన్నాయని వీటిపై నిఘా పెట్టామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

పాతబస్తీ ప్రాంతంలోని ఫలక్‌నుమాలో ఉంటున్న సొనాలి ఇంజనీరింగ్ విద్యార్థి ఇటీవల మాన్‌స్టర్‌ డాట్‌కాంలో ఓ ప్రకటన చూసింది. టీసీఎస్‌లో ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగం ఇస్తామన్నది అందులోని సారాంశం. అందులోని నంబర్‌కు ఫోన్‌ కాల్ చేసింది. ప్రశాంత్‌ అనే వ్యక్తి మాట్లాడాడు. తాను టీసీఎస్‌ బెంగళూరులో లీడ్‌ మేనేజర్‌నని, ప్రతిభ ఉన్నవారికి వెంటనే ఉద్యోగం వస్తుందని చెప్పాడు. రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.10 వేలు కట్టాలని చెప్పగా, ఆ మొత్తాన్ని చెల్లించి రిజిస్టర్ చేసుకుంది. ధరావతు కింద మూడు నెలల జీతం రూ.1.50 లక్షలు పంపించాలంటే బదిలీ చేసింది. ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుందని చెప్పిన అతను ఫోన్‌ స్విచ్చాఫ్ చేశాడు. పలుమార్లు ప్రయత్నించిన తరవాత మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను అశ్రయించింది. ఈ కేసు ఒకటే కాదు ఇలా 54 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో మోసపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విదేశీ కొలువులు, ప్రైవేటు, బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ పట్టభద్రులు నౌకరీ డాట్‌కాం, షైన్‌, మాన్‌స్టర్‌, క్వికర్‌ డాట్‌కాం వెబ్‌సైట్లలో అర్హతలను నమోదు చేస్తున్నారు. ఈ వివరాలను ఆ వెబ్‌సైట్ల నుంచి సైబర్‌ నేరస్థులు కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగార్థులకు నేరుగా ఫోన్లు చేసి తాము ఫలానా కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుము, ధరావతు, విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన నగదు పంపించాలంటూ రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు వసూలు చేసుకున్నాక సంప్రదింపులు నిలిపేస్తున్నారు. ఆయా వెబ్‌సైట్ల ప్రతినిధులమని సైబర్‌ నేరస్థులు చెబుతుండడంతో ఉద్యోగార్థులు నిజమేనని నమ్మి మోసపోతున్నారు. ఇలా వచ్చే ఫేక్ కాల్ విషయం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కంపెనీల పేరుతో వచ్చే కాల్స్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలంటున్నారు. పూర్తిగా నిర్ధారించుకున్నాకే, జాబ్ ప్రాసెస్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read Also…  World Wide Coronavirus: ప్రపంచదేశాల్లో ఆగని కరోనా కల్లోలం.. నాలుగు మిలియన్లు దాటిన మరణాల సంఖ్య