ఫేస్‌బుక్ కీచకుడు అరెస్ట్.. వీడో ఎర్రగులాబీ!

ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్స్ ఎక్కువైపోయాయి. వాటి ద్వారా కొంతమంది కీచకులు అమ్మాయిలను లోబరుచుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి కేరళలో జరిగింది. ఫేస్‌బుక్‌లో మహిళలతో పరిచయం పెంచుకుని.. ఆ సాన్నిహిత్యంతో వారిని లైంగికంగా లోబరుచుకున్న ఓ ప్రబుద్దుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 50 మందికి పైగా మహిళలు ఈ మాయగాడి వలలో పడ్డారని తెలిసి నివ్వెరపోయారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఎట్టిమనూర్ […]

ఫేస్‌బుక్ కీచకుడు అరెస్ట్..  వీడో ఎర్రగులాబీ!
Follow us

|

Updated on: Jun 02, 2019 | 10:33 AM

ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్స్ ఎక్కువైపోయాయి. వాటి ద్వారా కొంతమంది కీచకులు అమ్మాయిలను లోబరుచుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి కేరళలో జరిగింది. ఫేస్‌బుక్‌లో మహిళలతో పరిచయం పెంచుకుని.. ఆ సాన్నిహిత్యంతో వారిని లైంగికంగా లోబరుచుకున్న ఓ ప్రబుద్దుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 50 మందికి పైగా మహిళలు ఈ మాయగాడి వలలో పడ్డారని తెలిసి నివ్వెరపోయారు.

అసలు వివరాల్లోకి వెళ్తే.. ఎట్టిమనూర్ సమీపంలోని ఆరిపరబుకు చెందిన ప్రదీష్ కుమార్(25) గత కొన్ని నెలలుగా వివాహితులతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకునేవాడు. వారి ఫోన్ నెంబర్లు సంపాదించి.. పూర్తి వివరాలు తెలుసుకునేవాడు. అంతేకాదు వారి కుటుంబసమస్యలు తెలుసుకుని.. అమ్మాయిలా నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచి ఆ మహిళల భర్తలతో చాటింగ్ చేసేవాడు. వాటిని స్క్రీన్ షాట్స్‌గా తీసి ఆ వివాహితలకే పంపి.. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించేవాడు. అలా మానసికంగా ఆ మహిళలను కృంగతీసి మరింత సన్నిహితంగా చాట్ చేసేవాడు. వారి ఫొటోస్, చాట్స్‌ను అసభ్యంగా మార్చి.. వాటితో వాళ్ళను బెదిరించి లైంగికంగా లోబరుచుకునేవాడు. ఇలా ఈ మాయగాడి ఉచ్చులో 50 మందికి పైగా బాధితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అటు నిందుతుడు దగ్గర నుంచి ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నామని.. అతని దగ్గర ఉన్న అసభ్య ఫోటోలను కూడా డిలీట్ చేశామన్నారు. ఒక్కో మహిళలకు ఒక్కో సీక్రెట్ కోడ్ ఏర్పాటు చేసి.. అది చెబితేనే అతనితో చాట్ చేసేలా ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?