పార్టీ ఈవెంట్ల పేరుతో యువతులను వేధిస్తున్న ఓ ఈవెంట్ మేనేజర్‌కి దేహశుద్ధి చేశారు బాధిత యువతులు. పథకం ప్రకారం ట్రాప్ చేసి చితకబాదారు. చెన్నైలో ఈవెంట్ మేనేజర్ గా ఉన్న రాజా.. పెళ్లిళ్లు , ఫంక్షన్ లకు ఈవెంట్ మేనేజర్ గా ఉంటూ వెల్కమ్ గర్ల్స్ ని ప్రోగ్రామ్ లకు ఏర్పాటు చేస్తుంటాడు. పార్టీ ఈవెంట్ లలో కొంత మంది బడాబాబుల కోసం ఈవెంట్‌కు వచ్చిన వెల్కమ్ గర్ల్స్‌ని లైంగికంగా వేధింపులకు గురి చేసేవాడు. దీంతో మేనేజర్ వేధింపులపై తొలుత కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు యువతులు. ఆ తర్వాత పథకం ప్రకారం పుదుకోట్టై లో ఈవెంట్ ని ఏర్పాటు చేయాలనీ మేనేజర్ రాజుని రప్పించి చితకబాదారు బాధిత యువతులు. మహిళలు మేనేజర్ని చితకబాదిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
గుంటూరు జిల్లా కొల్లిపర ప్రాంతానికి చెందిన ఓ యువతికి దావులూరు గ్రామానికి చెందిన దేవరపల్లి సునీల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సునీల్… యువతికి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మరణించడంతో… తనను పెళ్లి చేసుకోవాలని సునీల్‌ను యువతి కోరింది. పెళ్లికి తన ఫ్యామిలీ మెంబర్స్ నిరాకరిస్తున్నారని సునీల్ ముఖం చాటేశాడు. ఈ ఘటనపై బాధితురాలు కొల్లిపర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also Read:షేక్ అవుతున్న బాలీవుడ్.. హనీ ట్రాప్‌లో 100 మంది సెలబ్రిటీలు.. 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం