Drunk Cop: తప్పతాగి.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏమైందంటే..?

SI Misbehaves with woman: ఆయనొక పోలీసు అధికారి.. ఒళ్లు మరిచేలా తప్పతాగాడు.. ఆపై ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన

Drunk Cop: తప్పతాగి.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏమైందంటే..?
Si Misbehaves With Woman

Updated on: Jun 23, 2021 | 5:48 AM

SI Misbehaves with woman: ఆయనొక పోలీసు అధికారి.. ఒళ్లు మరిచేలా తప్పతాగాడు.. ఆపై ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. వివరాలు.. విన‌య్ శ‌ర్మ రిషికేశ్‌లోని ఐఎస్‌బీటీ పోలీస్ స్టేష‌న్‌లో ఎస్సైగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం వినయ్ శర్మ తాగి మాజీ ఇంటి య‌జ‌మానురాలు ఇంటికి వెళ్లాడు. అక్క‌డ ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. అస‌భ్య ప‌ద‌జాలంతో మహిళను దూషించాడు. దాంతో ఆగ్ర‌హించిన మ‌హిళ సోమ‌వారం ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ ‌ను కలిసి.. ఎస్ఐపై ఫిర్యాదు చేసింది. దీంతో డీజీపీ అప్ప‌టిక‌ప్పుడే ఎస్సైని స‌స్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అనంత‌రం ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు.

డీజీపీ ఉత్తర్వులు అందిన వెంటనే.. చర్యలు తీసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శిశుపాల్ సింగ్ నేగి మంగళవారం తెలిపారు. ఎస్ఐపై విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read:

200మంది బీజేపీ కార్యకర్తలు మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిక… తప్పు చేశామంటూ…

పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చిచ్చు… చిక్కుల్లో సీఎం అమరేందర్ సింగ్ ..నాయకత్వ మార్పు తప్పదా …?