వెస్ట్ బెంగాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు రూ.14.5 కోట్ల విలువగల బంగారం పట్టుబడింది. సిలిగురి విభాగానికి చెందిన డీఆర్ఐ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 160 విదేశాలకు చెందిన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కడ్డీలు మొత్తం 26.560 కిలోలు ఉన్నాయని.. వీటి విలువ రూ.14.5 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.
Director of Revenue Intelligence (DRI) Siliguri unit seizes 160 pieces of foreign-made gold bars weighing 26.560kg valued around Rs 14.5 crores. Three people arrested. Further investigation on. #WestBengal pic.twitter.com/tCE2E044SW
— ANI (@ANI) August 15, 2020
Read More :
16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా