రివాల్వర్‌తో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. సంజయ్ అనే ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్నాడని సౌత్ డీసీపీ అతుల్ ఠాకూర్..

రివాల్వర్‌తో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య
Gun Fire

Updated on: Jul 28, 2020 | 6:01 PM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. సంజయ్ అనే ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్నాడని సౌత్ డీసీపీ అతుల్ ఠాకూర్‌ తెలిపారు. ఇతడు ప్రస్తుతం సాకేత్‌ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్ రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లాకు చెందినవాడని అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి తెలియాల్సి ఉందని.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు. మృతుడి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. అయితే మృతుడి సోదరుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. ఆ విషయాన్ని సహచరులతో ఎప్పుడూ చెప్తూ బాధపడేవాడని తెలుస్తోంది. అయితే ఈ విషయంలోనే ఒత్తిడికి గురై ఈ దాడికి పాల్పడి ఉంటాడేమోనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us