అత్తాపూర్ మూసీలో మొసలి కలకలం..

హైదరాబాద్ శివారు మూసీ నదిలో మరోమారు మొసలి కలకలం రేపింది. గతంలో పురానాపూల్ బ్రిడ్జి వద్ద కూడా మొసలి ప్రత్యక్షమై స్థానికుల్ని హడలెత్తించింది. తాజాగా అత్తాపూర్‌లో మొసలి కనిపించి స్థానిక ప్రజలతో పాటు పోలీసులను పరుగులు పెట్టించింది.

అత్తాపూర్ మూసీలో మొసలి కలకలం..

Updated on: Nov 06, 2020 | 1:03 PM

హైదరాబాద్ శివారు మూసీ నదిలో మరోమారు మొసలి కలకలం రేపింది. గతంలో పురానాపూల్ బ్రిడ్జి వద్ద కూడా మొసలి ప్రత్యక్షమై స్థానికుల్ని హడలెత్తించింది. ఇప్పుడు తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అత్తాపూర్‌లో మొసలి కనిపించి స్థానిక ప్రజలతో పాటు పోలీసులను పరుగులు పెట్టించింది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తాపూర్ మూసీ నదిలో మొసలి కనిపించింది. గత 15 రోజుల క్రితం వరకు భారీగా కురిసిన వర్షాలతో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు. దీంతో జలాశయం నుంచి మొసలి నగరంలోకి ప్రవేశించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొసలిని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నదిలో మొసలిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొసలిని గమనించి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అత్తాపూర్, హైదర్ గూడా లంగర్ హౌస్ లో ఉన్న స్థానికులు మూసీలోకి రావొద్దని పరిసర కాలనీవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వీలైనంత త్వరగా మొసలిని బంధిస్తామని అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us