అత్యాచారం కేసు.. ప్రముఖ నటుడి తనయుడు అరెస్ట్..!

అత్యాచారం కేసులో ప్రముఖ నటుడి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తును జరుపుతున్నారు.

అత్యాచారం కేసు.. ప్రముఖ నటుడి తనయుడు అరెస్ట్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2020 | 12:09 PM

అత్యాచారం కేసులో ప్రముఖ నటుడి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తును జరుపుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త సూర్యకాంత్‌ కుమారుడు విజయ్ హరీష్‌ విరుగంబక్కంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న ఓ యువతిపై ఈ ఏడాది జనవరిలో అత్యాచారం చేశాడు. జనవరి 2న చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లిన విజయ్.. తనకు మత్తు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అప్పుడు వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్న తిరువొట్టియార్ పోలీసులు.. 328, 354B, 354 C, 376సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు.

Read This Story Also: ఆంటీ తెగువకు ఫిదా అయ్యా: ఆనంద్ మహీంద్రా ట్విట్..