బిగ్ బ్రేకింగ్ : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో దారుణం, ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం

|

Feb 10, 2021 | 10:04 PM

తెలంగాణలోని మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ పై ఆటో డ్రైవర్..

బిగ్ బ్రేకింగ్ : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో దారుణం, ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై  ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం
Follow us on

తెలంగాణలోని మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. CMR ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా జోడిమెట్లలోని పొదల్లోకి తీసుకెళ్లి సదరు విద్యార్థినిపై ఆటో డ్రైవర్ దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అమ్మాయిని వివస్త్రను చేసి రోడ్ మీద వదిలేసి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. దీంతో స్థానికులు అమ్మాయిని రక్షించి మేడిపల్లిలో క్యూర్ హాస్పిటల్ కి తరలించారు. ఘట్కేసర్ పోలీసులు బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. కేసు నమోదు చేసుకుని ఆటోడ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదికూడా చదవండి :  ఉత్తరాఖండ్‌ విపత్తు అప్డేట్ : తపోవన్‌ టన్నెల్‌ దగ్గర ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యం, ఇంకా దొరకని 180 మంది జాడ