సూట్‌కేసులో శరీరభాగాలు..రంగంలోకి పోలీసులు

ముంబైలోని ఒక బీచ్ వద్ద మిస్టిరియస్ సూట్‌కేస్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి యొక్క శరీర భాగాలు అందులో ఉండటంతో అందరూ షాక్‌కి గురయ్యారు. కొందరు వాకర్స్ సోమవారం సాయంత్రం మఖ్దూమ్ షా బాబా మందిరం సమీపంలోని మహీమ్ బీచ్ వద్ద నీటిపై తేలియాడుతున్న నల్లని సూట్‌కేస్‌ను గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూట్‌కేస్ లోపల ఒక ప్లాస్టిక్ సంచిలో భుజం, ఒక కాలు యొక్క భాగం మరియు ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ భాగాలను […]

సూట్‌కేసులో శరీరభాగాలు..రంగంలోకి పోలీసులు
Follow us

|

Updated on: Dec 03, 2019 | 8:56 PM

ముంబైలోని ఒక బీచ్ వద్ద మిస్టిరియస్ సూట్‌కేస్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి యొక్క శరీర భాగాలు అందులో ఉండటంతో అందరూ షాక్‌కి గురయ్యారు. కొందరు వాకర్స్ సోమవారం సాయంత్రం మఖ్దూమ్ షా బాబా మందిరం సమీపంలోని మహీమ్ బీచ్ వద్ద నీటిపై తేలియాడుతున్న నల్లని సూట్‌కేస్‌ను గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూట్‌కేస్ లోపల ఒక ప్లాస్టిక్ సంచిలో భుజం, ఒక కాలు యొక్క భాగం మరియు ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ భాగాలను పోలీసులు కనుగొన్నారు. శరీర భాగాలను పరీక్షల నిమిత్తం సివిల్-రన్ సియోన్ ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు.

సముద్రంలో మిగిలిన శరీర భాగాలను వెతకడానికి స్థానిక మత్స్యకారులు, తీరప్రాంత పోలీసులు బృందాలు ఏర్పడ్డారు. బీచ్ పరిసర ప్రాంతంలోని సీసీ టీవి కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. మృతుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, నగరం శివారు ప్రాంతాల్లో తప్పిపోయిన వ్యక్తుల ఫిర్యాదులను స్కాన్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  దీనికి సంబంధించిన ఐపిసి సెక్షన్‌ 302 (హత్య),   సెక్షన్ 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలు కనిపించకుండా పోవడం) కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.