ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైరాలో బీజేపీ నేత నేలవెల్లి రామారావు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రామారావును చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే రామారావుపై దాడి జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, దాడికి పాల్పడి నిందితుడు మాడపాటి రాజేష్ మధిర కోర్టులో లొంగిపోయాడు.
కాగా, ఈ రోజు ఉదయం రామారావు ఇంట్లోకి బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రామారావుపై కత్తులతో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రామారావు బీజేపీలో ఆర్టీఐ సెల్ కన్వీనర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా..? ఇంకేమైన కారణాలున్నాయా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Vikarabad Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొని ఏడుగురు దుర్మరణం