Psycho Lover: ఏపీలో మరో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి.. వివరాలు ఇలా…

|

Jan 22, 2021 | 1:30 PM

ఏపీలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో వేధించి...ఒప్పుకోకపోవడంతో యువతిపై దాడికి తెగబడ్డాడు.  కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘోరం జరిగింది.

Psycho Lover:  ఏపీలో మరో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి.. వివరాలు ఇలా...
Follow us on

ఏపీలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో వేధించి…ఒప్పుకోకపోవడంతో యువతిపై దాడికి తెగబడ్డాడు.  కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘోరం జరిగింది. బీటెక్‌ చదువుతున్న లావణ్య అనే యువతిని  బట్టల షాప్‌లో పనిచేస్తున్న సునీల్‌ అనే యువకుడు ప్రేమించాలని 3 నెలల నుంచి వెంటపడుతున్నాడు. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఇంకేముంది వాడిలోని షాడిజం మేల్కొంది. వెంటనే ఆ యువతి ఇంటికెళ్లాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా లావణ్యపై కత్తితో దాడి చేశాడు.  తీవ్ర గాయాలైన ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేస్తున్నారు. దాడి చేసిన సునీల్‌ పరారీలో ఉన్నాడు.  అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read:

దుర్గగుడి వెండి సింహాల మాయం కేసు, మక్కపేటలో నంది విగ్రహం ధ్వంసం కేసు.. పోలీసుల అదుపులో నిందితులు!

Kurnool District: ఏడేళ్ల చిన్నారిని బలి తీసుకున్న నాటు వైద్యం.. పరారీలో వైద్యులు..ఏం జరిగిందంటే..?